calender_icon.png 4 May, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్

04-05-2025 02:09:08 PM

హైదరాబాద్: ఆర్టీసీ(RTC Workers)కార్మికులతో చర్చలకు సిద్ధమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యంపైనే ఆర్టీసీ నడుస్తోందని మంత్రి పొన్నం తెలిపారు. 5, 6 తేదీల్లో ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. పదేళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యమైందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సంస్థ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ముందుకెళ్తుందని, ఇబ్బందికర పరిస్థితులు తేవొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి బస్ స్టేషన్ వద్ద అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ పనులు పరిశీలించారు.

అనంతరం ఎల్కతుర్తి బస్ స్టేషన్(Elkathurthy Bus Station)లో ఇటీవల ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను పరిశీలించి కార్యకర్తలు , అధికారులతో కలిసి అల్పాహారం చేసి ఎల్కతుర్తి లో పెండింగ్ పనుల పై అధికారులతో ఆరా తీశారు. కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే వ్యాపారం ఆర్థిక వృద్ధి బాగుంటుందని ఆయన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మహిళలకు సూచించారు. హుస్నాబాద్ బస్ స్టేషన్ లో ఆకస్మిక పర్యటన చేసిన పొన్నం ప్రభాకర్ ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ కండక్టర్ ,డ్రైవర్ ల  సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.