04-05-2025 02:33:47 PM
జమ్ము కశ్మీర్ లో ప్రమాదం, ముగ్గురు జవాన్లు మృతి.
రంభన్ జిల్లాలో ఆర్మీ వాహనం లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి..
700 అడుగుల లోతైన లోయలో పడిన ఆర్మీ కాన్వాయ్ లోని వాహనం..
జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా లోయలో పడ్డ ఆర్మీ వాహనం.
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని( Jammu and Kashmir) రంభన్ జిల్లాలో ఆదివారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. జమ్మూ నుండి శ్రీనగర్‌కు వెళ్తున్న వాహనం రోడ్డు పక్కన అదుపు తప్పి 700 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది(Jawans) మరణించారని ఉన్నతాధికారులు తెలిపారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బ్యాటరీ చష్మా సమీపంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు జమ్మూ నుండి శ్రీనగర్‌కు వెళ్తున్న జాతీయ రహదారి 44లో ఆర్మీ ట్రక్కు ఒక కాన్వాయ్‌లో భాగంగా ఉందని అధికారులు సూచించారు. సైన్యం, పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సేవకులు వెంటనే సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారని, వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతులను సిపాయిలు అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్‌గా గుర్తించారు. వారి మృతదేహాలను లోయ నుండి వెలికితీస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో వాహనం నలిగిపోయిన లోహపు కుప్పగా మారిపోయిందని పేర్కొన్నారు.