04-05-2025 12:44:35 AM
4-.5.-2025 నుంచి 10.-5.-2025 వరకు
రామడుగు రంగన్న సిద్ధాంతి
మేషం
--ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి సామా న్యంగా ఉంది. నిరుత్సాహంగా ఉంటా రు. అనుకున్న పనులు విజయవంతమవుతాయి. ధన విషయక ఇబ్బందులు కలుగుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు వివాహ నిశ్చయాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మంచి కళాశాలలో సీటు దొరుకుతుంది. రైతులకు సామాన్య లాభాలు ఉంటా యి. మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది.
వృషభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మనస్సు సంతోషంగా ఉం టుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. యువతీ యువకులకు తొందరగా మంచివారితో వివాహాలు జరుగుతాయి. ఉద్యోగ స్తులు సంతోషవార్తలు వింటారు. వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. విద్యార్థులకు చదువులలో కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రైతులకు లాభాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. -మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది.
మిథునం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు. గృహ సంబంధ ఖర్చు చేస్తారు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకో వాలి. బంధుమిత్రులతో భేదాభిప్రాయా లు వస్తాయి. యువతీ యువకులకు వివాహ సంబంధాలలో ఆలస్యం.విద్యార్థులకు చదువు విషయమై అనాసక్తి ఏర్పడుతుంది. వ్యాపారస్తులు, రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు విపరీత ఒత్తిడి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది.
కర్కాటకం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. చేసే పనులు అనుకూలిస్తాయి. తరచూ ప్రయాణాలు. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు అనుకూలి స్తాయి. విద్యార్థులు చదువులలో రాణిస్తారు. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటా రు. వ్యాపారస్తులు, రైతులకు స్వల్పలాభాలు వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
సింహం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ధన వ్యయం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.చేసే పనులు ఆలస్యంగా పూర్తి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. యువతీ యువకులకు వివాహ ప్రయత్నం కలిసివస్తుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగస్తులకు అధిక ఒత్తిడి. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.
కన్య
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఉత్సాహంగా ఉంటారు. శుభకార్యాలు చేస్తారు. తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్త వుతాయి. యువతీ యువకులకు కోరుకున్న వారితో వివాహ నిశ్చయాలు కుదురుతాయి. విద్యార్థులకు విద్యా విషయక అభివృద్ధి జరుగుతుంది. వ్యాపా రస్తులకు, రైతులకు అనుకూల ఫలితా లు వస్తాయి. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.
తుల
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ధనలాభాలు కలుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బం ధుమిత్రులను, ఆత్మీయులను కలుస్తారు. శుభవార్తలు వింటారు. మానసిక ఒత్తిడి. యువతీ యువకులకు వివాహ ప్రయత్నా లు ఫలిస్తాయి. ఉద్యోస్తులకు పైవారితో స్పర్ధలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవస రం.మొత్తం మీద ఈరాశివారికి 50 శాతం అనుకూలత,50 శాతం ప్రతికూలత ఉంది.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఉత్సాహంగా ఉంటా రు. శుభకార్యాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. చేసే పనులు పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని పొందుతారు. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్ప లాభా లు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కొంత ఊరట లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. మంచివారితో పరిచయా లు కలుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. శారీరక అనారో గ్యం కలుగుతుంది. యువతీ యువకులకు పెండ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థు లు ఉన్నత ఫలితాలు. వ్యాపారస్తులు, రైతులు నిలకడగా ఉంటారు. ఉద్యోగస్తు లు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత 45 శాతం ప్రతికూలత ఉంది.
మకరం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేసే పనులు లాభిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శుభ వార్తలు వింటారు. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.- విద్యార్థులు చదువులలో రాణిస్తారు. వ్యాపారస్తులు, రైతులు లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు.మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.
కుంభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. దూరప్రయాణాలు చేస్తారు. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. ఆలోచించి పని చేస్తే లాభాలు. వేగిర పడకూడదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కొన్ని పనులు కలిసివస్తాయి. కొందరితో మనస్పర్ధలు. యువతీ యువకులకు వివా హ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యాయోగం. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవస రం. ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి. మొ త్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
మీనం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. శుభకార్యాలు చేస్తారు. చేసే పనులలో ప్రతికూలత ఏర్పడి ఆలస్యమవుతుంది. ధనం అధికంగా ఖర్చ వుతుంది. అందరితో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు వివాహ విషయంలో ఆలస్యమవుతుం ది. విద్యార్థులకు విద్యావిషయక స్తబ్దత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో చాలా జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పని ఒత్తడి చాలా పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది.