8 June, 2026 | 1:45 AM

స్వదేశీ వస్తువులనే వినియోగిద్దాం

08-06-2026 12:00 AM

ముకరంపుర, జూన్ 7(విజయ క్రాంతి): స్వదేశీ జాగరణ మంచ్ కరీనగర్ విభాగ్ వారి ఆధ్వర్యంలో ఆదివారం వాణి నికేతన్ కిడ్స్ కేర్ లో విభాగ ప్రశిక్షణ వర్గ  నిర్వహించారు .ఈ కార్యక్రమం లో స్వదేశీ వ్యాపార మంచ్ అఖిలభారత అధికారి మనోహర్ అగర్వాల్ పాల్గొని స్వదేశి వస్తువుల వినియోగం వాటి ఉపయోగాలు పైన అవగాహన కల్పిస్తూ స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించాలని కోరారు.

దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతుందని, మన దేశీయ కంపెనీలు అభివృద్ధి చెందుతాయాని,దీనివల్ల నిరుద్యోగం కూడా తగ్గిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర సంయోజక్ స్వదేశీ జాగరణ మంచ్  డాక్టర్ సత్తులింగమూర్తి, సిహెచ్ వి సాయిప్రసాద్  ఐఏఎస్ రిటైర్డ్ మరియు సిఏ ముక్క హరీష్ బాబు  తెలంగాణ ప్రాంత సంయోజక స్వదేశీ జాగరణ మంచ్, నగర  కన్వీనర్ డాక్టర్ కటకం అమర్నాథ్, కో కన్వీనర్ నాగమల్ల వేణుమాధవ్ మరియు చీటీ మాధవరావు విభాగ్ కన్వీనర్   దామోదర్ రావు జిల్లా సంపర్క్ ప్రముఖ పాల్గొన్నారు.

అలాగె  కొత్తగా కరీనగర్ పట్టణ కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు .కరీనగర్ నగర విభాగ కన్వీనర్ గా పసుల మైపాల్, కో -కన్వీనర్ గా దీకొండ తిరుపతి, ట్రెజరర్ గా పసుల తిరుపతిని ఎన్నుకోవడం జరిగింది.