8 April, 2026 | 12:15 AM

రాలిపడిన హెలికాఫ్టర్

01-09-2024 12:58 AM

కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్), ఆగస్టు 31: కేదార్‌నాథ్ యాత్రికులను తరలించే సమయంలో క్రిస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాఫ్టర్ ఇటీవల దెబ్బతింది. దీనిని ఘటనా స్థలంలో రిపేర్ చేసే అవకాశం లేకపోవడంతో... భారత వైమానిక దళానికి చెందిన చాపర్ సహాయంతో తరలించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆర్మీ ఎంఐ ఛాపర్‌కు కేబుల్ సాయంతో హెలికాఫ్టర్‌కు కట్టి తరలించారు. కొద్ది దూరం ప్రయాణించాక కేదార్‌నాథ్ గచౌర్ మధ్య భీంబాలి ప్రాంతంలో ఎంఐ ఛాపర్‌కు కట్టిన తాడు తెగిపోయింది. దాదాపు వేల అడుగుల ఎత్తునుంచి హెలికాఫ్టర్ భూమిపై పడిపోయింది. ఇందులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.