ఎస్ఆర్పీ 3 గనిని సందర్శించిన జీఎం
04-07-2026 07:47 PM
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని SRP 3 గనిని శనివారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ సందర్శించారు. గనిలోకి దికి పనిప్రదేశాలను తనిఖీ చేశారు. ఇటీవల 5 వ సీమ్ లో ప్రమాదం చోటు చేసుకున్న డిస్ట్రిక్ట్ లో పరిస్థితిని, ప్రమాద తీరుతెన్నులను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకొని రక్షణపై తగు సూచనలు చేశారు. ఎస్ఓపీ, ఎస్ఎంపీలకు లోబడి భవిష్యత్లో ఏ చిన్న ప్రమాదం పునరావృతం కాకుండా ప్రతీ ఒక్కరు నిబద్దతతో తమ తమ విధులు నిర్వహించాలని సూచించారు. అంతకు ముందు ఏజెంట్ తో పాటు ఇతర అధికారులతో గని ఉత్పత్తి , ఉత్పాదకతపై సమీక్షించారు.






