calender_icon.png 6 December, 2024 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుట్టుశిక్షణ పేరిట కుచ్చుటోపీ

10-10-2024 12:10:33 AM

రూ.7 లక్షలతో ఉడాయించిన సంస్థ

బెల్లంపల్లి, అక్టోబర్ 22: కుట్టు శిక్షణ, ఉపాధి పేరుతో మహిళలను నమ్మించి, రూ.7లక్షలతో ఓ స్వచ్ఛంద సంస్థ ఉడాయించింది. ఏపీలోని నంద్యాల ప్రాంతానికి చెంది న మదర్ ప్రతిభ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మహిళలకు కుట్టుమిషన్లు అందించి ఎంబ్రాయిడరీ నేర్పిస్తామని నమ్మబలికారు.

మరింతగా నమ్మించేందుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతుల మీదుగా కుశ్నపల్లి గ్రామానికి చెందిన 8 మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో దిగిన ఫొటోలను ఎరగా చూపి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో మహిళల నుంచి రూ.5 వేల నుంచి రూ.7 వేల చొప్పున మొత్తం రూ.7 లక్షల వరకు వసూలు చేశారు.

శిక్షణ పూర్తి కాకుండానే మహిళలకు ధ్రువీకరణ పత్రాలను అందజేసి అక్కడి నుంచి జారుకున్నారు. మోసపోయినట్టు గ్రహించిన మహిళలు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.