11 March, 2026 | 4:17 AM

వెలుగుమట్ల నిర్వాసితులకు నేడు పట్టాలు

11-03-2026 12:52 AM

311 మందికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు

101 మందికి ఇంటి నిర్మాణ పత్రాలు

కూసుమంచి, మార్చి 10 (విజయక్రాంతి): ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు పట్టాలు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయ మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మార్చి 15లోపు ఆదుకుంటామన్న హామీ మేరకు బుధవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మం ఐడీఓసీ వేదికగా భూదాన్ నిర్వాసితులకు పట్టాలు అందజేయనున్నారు.

ఇటీవల బాధితులతో జరిగిన ముఖాముఖిలో వారి గోడును విన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. వెనువెంటనే అధికారులను రంగంలోకి దింపారు. పారదర్శకమైన సర్వేను పూర్తిచేయించి, నిజమైన నిరుపేదలను గుర్తిం చారు. బుధవారం సాయంత్రం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలిసి మంజూరుపత్రాలను అందజేయనున్నారు.

నిర్వాసితులకు కేవలం స్థలమే కాకుండా, ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం కూడా మంజూరైంది. ఇంటి స్థలం లేని 311 మందికి ఇంటి స్థలం పట్టాతోపాటు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం ఇస్తారు. స్థలం ఉన్న 101 మందికి ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం అందజేస్తారు.