11 March, 2026 | 5:38 AM

బీజేపీ X కాంగ్రెస్

11-03-2026 12:50 AM
  1. ఆదిలాబాద్ మున్సిపల్ తొలి సమావేశంలోనే కౌన్సిలర్ల బాహాబాహీ 
  2. చర్చ జరగకుండానే అజెండా పాస్ అయినట్లు ప్రకటించిన చైర్‌పర్సన్ 
  3. ఆమె ఛాంబర్ ముందు బైఠాయించిన బీజేపీ కౌన్సిలర్లు 
  4. పరస్పరం ఆరోపణలు.. ఉద్రిక్తత

ఆదిలాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మున్సిపల్ తొలి సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. అభివృద్ధిపై చర్చించాల్సిన సభ కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య యుద్ధ క్షేత్రంగా మారింది. సభలో చర్చ జరగకుండానే చైర్‌పర్సన్ బండారి అనూష ‘అజెండా పాస్’ అయినట్లు ప్రకటించి వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది.

ఏకపక్ష నిర్ణయా న్ని నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్లు ఆమె ఛాంబర్ ముందు బైఠాయించి 3 గంటల పాటు నిరసన తెలిపారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుం టూ, ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకుని బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం చైర్‌పర్సన్ బండారి అనూష అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎక్స్‌అఫిషి యో సభ్యుడి హోదాలో పాల్గొన్నారు.

ఎజెం డా అంశంపై సభ్యులు చర్చలో భాగంగా తాగునీటి సమస్యను బీజేపీ సభ్యులు లేవనెత్తారు. ఆ వెంటనే ఎజెండా పాస్ అంటూ చైర్‌పర్సన్ సమావేశ మందిరం నుంచి తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. దీంతో బీజేపీ కౌన్సిలర్లులు ఆమె ఛాంబర్ ఎదుట ఖాళీ బిందెలతో 3 గంటలపాటు బైఠాయించారు. ఛాంబర్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, బయట బీజేపీ కౌన్సిలర్లు పోటా పోటీ నినాదాలతో మున్సిపల్ కార్యాలయం మార్మో గింది.

బయటకొచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఇరువర్గాలు ఒకరి కాలర్ మరొకరు పట్టుకుని బాహాబాహీకి దిగారు. దీంతో డీఎస్పీ జీవన్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని బీజేపీ కౌన్సిలర్‌లను, నాయ కులను అక్కడి నుంచి తరలించేందుకు య త్నించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

చివరకు బీజేపీ నేతల నినాదాల మధ్యనే చైర్‌పర్సన్‌తో పాటు కౌంగ్రెస్ సభ్యులు కార్యాల యం నుంచి వెళ్లిపోయారు. అంతకుముం దు ఆదిలాబాద్ అభివృద్ధికి సభ్యులందరూ పార్టీలకతీతంగా కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు.

మున్సిపల్ చైర్మన్ బండారి అనూష మాట్లాడుతూ.. పట్టణంలోని 49 వార్డులన్నీ తనకు సమానమని, అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమా లు చేపట్టేందుకు తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని బీజేపీ కౌన్సిలర్ వార్డు నుంచే మొదలుపెట్టామని చెప్పా రు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన రెండేళ్ల కా లంలో ఆదిలాబాద్‌కు ఎన్ని నిధులు తెచ్చా రో చెప్పాలని ప్రశ్నించారు.