సైక్లింగ్ దిగ్గజం కన్నుమూత
21-08-2024 11:32 PM
న్యూఢిల్లీ: వెనెజులా సైక్లింగ్ దిగ్గజ క్రీడాకారిణి డ్యానియెలా లారియల్ కిరినోస్ అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు. అమెరికాలోని లాస్ వెగాస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో లారియల్ మృతదేహం లభ్యమైంది. భోజనం చేస్తుండగా ఆహారం గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు.
50 ఏళ్ల డ్యానియెలా 1992 నుంచి 2012 మధ్య జరిగిన ఒలింపిక్స్‌లో ఐదుసార్లు వెనెజులా తరఫున పాల్గొంది. 2002లో సెంట్రల్ అమెరికన్, కరీబియన్ గేమ్స్‌లో రెండు స్వర్ణ పతకాలు నెగ్గిన లారియల్.. పాన్ అమెరికన్ చాంపియన్‌షిప్స్‌లోనూ పసిడి సొంతం చేసుకుంది. డ్యానియెలా మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వెనెజులా ఒలింపిక్ కమిటీ ‘ఎక్స్’ వేదికగా నివాళి అర్పించింది.






