15 August, 2026 | 11:33 AM

వేదిక మారితే మాకేంటి?

21-08-2024 11:33 PM

ముంబై: మహిళల టీ20 వరల్డ్ కప్ వేదికను బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. వేదిక మార్పుపై టీమిండియా మహిళా జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ స్పందించింది. ‘వేదిక మార్పు అనేది మా ప్రాక్టీస్ మీద ఎటువంటి ప్రభావం చూపదు. ఏ దేశంలో జరిగినా మా ఆటతీరు మారదు. జట్టు విజయంలో ఎలా భాగస్వామ్యం కావాలనే విషయం మీదే నేను దృష్టి పెడతాను’ అని తెలిపింది. మహిళల టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్, షార్జాల్లో జరగనుంది.