22 April, 2026 | 11:32 AM

Breaking News

TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •   కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు   •   RTC Strike Today: డిపోల వద్ద సమ్మె.. వందల బస్సులు నిలిపివేత   •   ఆగిపోయిన ఆర్టీసీ రథచక్రం   •  

మరణశిక్ష పడే కేసిది

29-09-2024 01:45 AM

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ 

మాజీ ప్రిన్సిపాల్ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయం

కోల్‌కతా,  సెప్టెంబర్ 28: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థిని హత్యకేసుతోపాటు అనేక ఇతర కేసులు ఎదుర్కొంటున్న ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది.

సందీప్‌పై మోపిన అభియోగాలు చాలా తీవ్రమైనవని, అవి కోర్టులో నిరూపణ అయితే మరణ శిక్ష ఖాయమని.. అందువల్ల బెయిల్ ఇవ్వటం కుదరదని శనివారం తేల్చి చెప్పింది. అభియోగాల తీవ్రత  ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా చూపిస్తున్నదని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎస్ దే అభిప్రాయపడ్డారు. తల పోలీస్‌స్టేషన్ మాజీ ఎస్‌హెచ్‌వో అభిజిత్ మండల్‌కు కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది.