23 July, 2026 | 1:52 AM

విద్యార్థులపై దాడితో బీజేపీకి గడ్డు కాలం మొదలైంది

23-07-2026 12:15 AM

 సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ 

సిద్ధిపేట, జూలై 22 (విజయక్రాంతి): నీట్ పరీక్ష పత్రాలు లీకేజీ వ్యవహారంపై నిలదీసినందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై మోడీ ప్రభుత్వం దాడి చేయడం అప్రజాస్వామికం అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు. బుధవారం పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు విక్టరీ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులపై దాడితో బిజెపికి మోదీ ప్రభుత్త్వానికి గడ్డు కాలం మొదలైందన్నారు.

అధికారం ఎవరికి శాశ్వతం కాదని అధికారం ఉందని దుర్వినియోగం చేస్తూ ప్రజలు విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి,  ఖలీముద్దీన్, దాస అంజయ్య, గంప మహేందర్, మార్కా సతీష్, రాజ్ బహదూర్ రెడ్డి, మీసం నాగరాజ్, సంతోషి, వాహబ్ ,గయాస్, హర్షద్, దస్తగీర్, వంశీ, బొమ్మల ప్రవీణ్, ప్రభాకర్, విజయ్, సుధీర్, దేశెట్టి నరేష్, బిక్షపతి పాల్గొన్నారు.