23 July, 2026 | 1:44 AM

అట్టహాసంగా ప్రారంభమైన నవోదయ ప్రాంతీయ స్థాయి ఫుట్‌బాల్ ఎంపికలు

23-07-2026 12:13 AM
  1. హాజరైన నాలుగు రాష్ట్రాల విద్యార్థులు 
  2. వర్షం కారణంగా మూడు గంటల ఆలస్యం.. 
  3. నేటి నుంచి జోరుగా క్రీడా పోటీలు 

గజ్వెల్, జూలై 22: సిద్దిపేట జిల్లా వర్గల్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ స్థాయి ఫుట్బాల్ ఎంపికలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు ఎంపీ హాల్లో దీపప్రజ్వలనతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిం చారు. విద్యాలయ ఉప ప్రధానాచార్యులు మోహన్ రాథోర్ ఎంపికల నిర్వహణకు రూపొందించిన ప్రణాళికను ఎస్కార్ట్ టీచర్లు, విద్యార్థులకు వివరించారు.

సిద్దిపేట ఫుట్బా ల్ అసోసియేషన్కు చెందిన కోచ్లు కూడా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ మాట్లాడుతూ, గత ఏడాది ఇదే విద్యాలయంలో సుబ్రతో కప్ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఈ ప్రాంతీయ స్థాయి ఎంపికలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎంపికలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎలాంటి వివాదాలకు తావు ఉండదని స్పష్టం చేశారు.

వ్యాయామ ఉపాధ్యాయుడు వీరేందర్ సింగ్ ఎస్కార్ట్ టీచర్లు, విద్యార్థులకు ఎంపికల నిర్వహణపై అవసరమైన సూచనలు చేశారు. అనుభవజ్ఞులైన వ్యాయా మ ఉపాధ్యాయులు తమ వంతు సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వరిష్ట అధ్యాపకుడు జే. నాగభాస్కర్ వందన సమర్పణ చేయగా, తెలుగు అధ్యాపకుడు ఎం. విజయ్ కుమార్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఉదయం నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా ఎంపికలు సుమారు మూడు గంటలు ఆలస్యమై మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభ మయ్యాయి. అనంతరం సాయంత్రం 5 గంటల వరకు అన్ని విభాగాల్లో ఎంపికలు నిర్విరామంగా కొనసాగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి చెందిన జవహర్ నవోదయ విద్యాల యాల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు, 20 మంది ఎస్కార్ట్ టీచర్లు ఈ ఎంపికల్లో పాల్గొంటున్నారు. ప్రాంతీయ స్థాయి ఎంపికల సందర్భంగా గురువారం సాయంత్రం 6:30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు.