23 July, 2026 | 1:51 AM

నకిలీ ఎరువుల కేసులో ఏడుగురి అరెస్ట్

23-07-2026 12:16 AM

పరారీలో మరో ఇద్దరు నిందితులు

నాగర్ కర్నూల్, జూలై 22 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా వెలుగు చూసిన నకిలీ డీఏపీ ఎరువుల కేసులో తొ మ్మిది మందిని నిందితులుగా గుర్తించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపారు. ప్రధా న నిందితుడు జగదీష్‌తో పాటు మరో నిం దితుడు సంతోష్‌రెడ్డి పరారీలో ఉండగా, మిగిలిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

ఈనెల 17న మహదేవునిపేట గ్రామంలో వ్యవసాయశాఖ అధి కారులు, బిజినపల్లి పోలీసులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో రైతుల వద్ద నుంచి కొన్ని బస్తాల నకిలీ డీఏపీ ఎరువులను స్వాధీనం చేసుకోగా హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప రిసరాల్లోని త్రిమూర్తి ఎంటర్‌ప్రైజెస్ పేరుతో నకిలీ డీఏపీ ఎరువుల తయారీ కేంద్రం నడుపుతున్నట్లు ఆ ప్రాంత పోలీసులు గుర్తించిన ట్లు తెలిపారు. కాగా ఈ కేసులో జిల్లాలోని కొల్లాపూర్ అచ్చంపేట ప్రాంతాల్లోని ఉన్నత వర్గానికి చెందిన బడా నేతల ఫర్టిలైజర్ దుకాణదారులను తప్పించేందుకు భారీప్రయ త్నాలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఏడీఏ పూర్ణచందర్‌రెడ్డి, సీఐ అశోక్ రెడ్డి, ఎస్‌ఐ సంషుద్దీన్ పాల్గొన్నారు.