28 August, 2026 | 2:05 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

పిఠాపురంలో కుటుంబ కథాచిత్రం

21-04-2026 02:38 AM

రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పిఠాపురంలో అలా మొదలైంది’. సీనియర్ దర్శకుడు మహేశ్‌చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్‌ఎం మురళి ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

దుండిగల్ల బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఇది పూర్తిగా కుటుంబ కథాచిత్రం. ఇందులో రాజకీయ అంశాలేవీ ఉండవు. తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించాం” అన్నారు. ఎఫ్‌ఎం మురళి మాట్లాడుతూ.. ‘నేను జర్నలిస్‌గా పిఠాపురంలో పనిచేస్తుంటా. దర్శకుడు మా ఇల్లును షూటింగ్‌కు అడిగారు. ఒకసారి షూటింగ్ చూశా. అప్పుడే ఈ సినిమాలో నిర్మాతగా భాగం కావాలనుకున్నా” అని చెప్పారు. ‘ప్రీమియర్స్ చూసిన అందరూ కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. మౌత్ టాక్‌తో మా సినిమా ముందుకు వెళ్తూనే ఉంటుంద’ని ఆకుల సురేశ్ పటేల్ తెలిపారు.