15 June, 2026 | 8:44 PM

Breaking News

అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •  

చెరువులో శవా తేలినతండ్రి, ఇద్దరు పిల్లలు

11-11-2024 01:14 AM

మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

అన్నదమ్ముల ఆస్తి తగదాలకు మూడు ప్రాణాలు బలి!

సిద్దిపేట, నవంబర్ 10 (విజయక్రాంతి): అన్నదమ్ముల ఆస్తి తగాదాలకు మూడు నిండు ప్రాణాలు బలైన ఘటన సిద్దిపేటలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు, సిద్దిపేట టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటలోని నెహ్రూనగర్‌లో ఉంటున్న తేలు సత్యం(48) ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ జీవిస్తున్నాడు. నాలుగేండ్ల కింద తన భార్య చనిపోగా శిరీష అనే మహిళను రెండో పెండ్లి చేసుకున్నాడు. ఇతనికి అద్వేశ్‌నంద(8), త్రివన్న హసిని(6) ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆస్తి పంపకం విషయంలో తన తమ్ముడు శ్రీనివాస్‌తో విభేదాలు వచ్చాయి. తనకు రావాల్సిన రూ.5 లక్షలు, ఇంట్లో వాటా స్థలాన్ని ఇవ్వాలని సత్యం తమ్మున్ని కోరాడు. అందుకు శ్రీనివాస్ నిరాకరించాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో మానసిక క్షోభకు గురైన సత్యం శనివారం పిల్లలతోకలిసి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు.

ఆదివారం సిద్దిపేట శివారులోని చింతల చెరువు వద్ద సత్యం బైక్, సెల్ ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు గజ ఈతగాళ్లతో వెతికించగా ముగ్గురి శవాలు లభించాయి. సత్యం భార్య శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు.