16 April, 2026 | 8:13 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పండుగలా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

02-03-2026 12:25 AM

కోదాడ, మార్చి 1 : పట్టణంలోని గరల్స్ హై స్కూల్ 1981-82 పదవ తరగతి పూర్వ విద్యార్థులు దశాబ్దాల అనంతరం ఆదివారం పండుగ వాతావరణంలో ఆత్మీయంగా కలుసుకున్నారు. పట్టణంలోని ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వారు తెలిపారు.

కార్యక్రమంలో పాటలు, ఆటలు, సరదా సంభాషణలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం తాము విద్యాభ్యాసం చేసిన పాఠశాలను సందర్శించి, తరగతి గదులు, ప్రాంగణం చూసి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.  సూర్యాపేట గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావు  ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బాలమ్మ పాల్గొన్నారు.