16 April, 2026 | 8:16 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

02-03-2026 12:27 AM

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

సూర్యాపేట, మార్చి 1 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులపై చిత్తశుద్ధితో ఉందని వారి ప్రతి సమస్యను పరిష్కరించదానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని టీచర్స్ శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి, ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధిలు అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని  ఐఎంఏ ఫంక్షన్ హాల్లో ఆత్మకూరు మండలం ఏవీకే తండా పాఠశాల ఉపాధ్యాయురాలు తంగేళ్ళ పద్మ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం వారు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అత్యధిక మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు కాంగ్రెస్ అభిమానులు ఉన్నారని ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో వారంతా భాగస్వాములయ్యరన్నారు.  ప్రభుత్వంతో ఉన్నతాధికారులతో మాట్లాడి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పిఆర్టియు భవనం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు.

ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తాను అందుబాటులో ఉండి పరిష్కరిస్తామన్నారు. గత 26 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థనీ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దున ఘనత తంగేళ్ల పద్మ అన్నారు. తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉత్తమ విద్య అందించేందుకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు.  పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు