16 April, 2026 | 10:05 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

అక్షర సామాజిక సేవలు అభినందనీయం

02-03-2026 12:24 AM

సూర్యాపేట, మార్చి 1: అక్షర ఫౌండేషన్ సూర్యాపేట ఆధ్వర్యంలో, ఎస్ కే ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో, శంకర కంటి హాస్పిటల్ హైదరాబాద్ సారథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపం నందు ఉచిత కంటి మెగా వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నీ మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్ చైర్మన్ ఎండి షఫీ ఉల్లాలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. ప్రతి మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యమని, ఎన్ని సంపదలు ఉన్న ఆరోగ్య లేకపోతే అది వ్యర్థమన్నారు. ప్రతి ఒక్కరు కంటి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ  ఉచిత కంటి వైద్య శిబిరంలో 42 మందికి ఆపరేషన్స్ అవసరముండి హైదరాబాద్ కు తీసుకెళ్లారు. 280 మందికి వివిధ కంటి సమస్యలు ఉన్నవారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి, అక్షర ఫౌండేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగయ్య, రుద్రంగి కాళిదాసు, బత్తుల దామోదర్ రెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.