28 May, 2026 | 2:35 AM

మిడిల్ క్లాస్ అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం

28-05-2026 01:14 AM

శ్రీకాంత్, లయ హీరోహీరోయిన్లుగా, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. ఈ సినిమాను దర్శకుడు జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో జీకే సీఎన్ నిర్మిస్తోంది. ఈ మూవీ టీజర్‌ను బుధవారం లాంచ్ చేయగా, ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేసి చాలా రోజులైంది” అన్నారు.

హీరోయిన్ లయ మాట్లాడుతూ.. “ఈ సినిమా చేస్తుంటే ఇంట్లో వాళ్లతో కలిసి పనిచేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందే వీరందరితో కలిసి పనిచేశా” అని తెలిపారు. దర్శకుడు జీ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఇది భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. ఇందులో కర్మ ఫలితం గురించి చెప్పాం” అని చెప్పారు. ‘చాలా ఫ్రెండ్లీగా, పాజిటివ్ వాతావరణంలో ఈ సినిమాను పూర్తి చేశామ’ని  నిర్మాత చందూ చెప్పారు.