calender_icon.png 6 February, 2026 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీనగర్ సుధా పీజీ ఉమెన్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం

06-02-2026 12:27:34 AM

  1. షార్ట్ సర్క్యూట్ పేలిన గీజర్
  2. మంటలు ఆర్పేసిన ఫైర్ సిబ్బంది
  3. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ లో ఉన్న సుధా పీజీ ఉమెన్ హాస్టల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఉమెన్ హాస్టల్ లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మొదటి అంతస్తు నుంచి హాస్టల్లో ఉన్న 15 మంది విద్యార్థులు నిచ్చెన ద్వారా బయటకు వచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని జరిగినట్లు ముషీరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మూడు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను పూర్తిగా ఆర్పివేశారు.

అగ్ని ప్రమా దం జరిగిన సమయంలో విద్యార్థులు  సురక్షితంగా బయటపడడంతో  ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన స్థలా న్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ పావని వినయ్ కుమార్,  సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసిపి నర్సయ్య, చిక్కడపల్లి ఏసిపి ఎల్. రమేష్ కుమార్, ముషీరాబాద్ సిఐ రాంబాబు, హైదరాబాద్ ఫైర్ డిస్టిక్ ఆఫీసర్ వెంకన్న సంఘటన స్థలాన్ని సందర్శించా రు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.