‘డబుల్’ ఇళ్లలో వసతులు కల్పించాలి
12-06-2024 12:25 AM
యాదాద్రి భువనగిరి, జూన్ 11 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించాలని లబ్ధిదారులు మంగళవా రం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజే శారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యం కల్పించడంతో పాటు రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. కనీస వసతులు కల్పించకపోవడంతో ఉండడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. లబ్ధిదారులు చేగూరి సుధాకర్, కాచం శ్రీదేవి, కొత్త సత్యం పాల్గొన్నారు.






