పల్లెటూరులో ఎగిరే కారు
ఉత్తరాఖండ్ యువకుడి అద్భుత ఆవిష్కరణ
డెహ్రాడూన్, ఆగస్టు ౮: ఉత్తరాఖండ్‌కు చెందిన రవి అనే యువకుడు ఎగిరే కారును తయారు చేశాడు. అల్మోరాలో తాజాగా యువకుడు గాలిలో కారును నడిపి యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. కారుకు‘ హపిడా స్కైలెక్స్ ప్రొటోటైప్’ అని నామకరణం చేశాడు. ప్రయోగానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాఫ్లీఖాన్ గ్రామానికి చెందిన రవి తమ్తాకు చిన్నప్పటి నుంచి సాంకేతికత, వాహనా తయారీపై మక్కువ. ‘హపిడా స్కై’ స్టార్టప్ ద్వారా డ్రోన్ సాంకేతికతను ఆధునీకరించి రవి ఈ వాహనాన్ని తయారు చేశాడు.
ఈ వాహనంలో కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించగలరు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల రవి భావోద్వేగానికి గురయ్యాడు. అయితే.. రవి ఈ ప్రయోగానికి పెటేంట్ హక్కులు తీసుకుంటారా? లేదా ఏదైనా కంపెనీ హక్కుల కోసం పోటీ పడుతుందా? అనేది భవిష్యత్తులో చూడాల. రవి ఇప్పటికే లక్ట్రిక్ వాహనాలను వేగంగా ఛార్జ్ చేసే ఎలక్ట్రోలైట్ పంప్‌ను తయారు చేశాడు. ఫోన్ ఛార్జింగ్ షూస్, జీపీఎస్ ఆధారిత స్టిక్ లాంటి అనేక పరికరాలను సైతం రూపొందించాడు.






