11 August, 2026 | 4:05 AM

ఈత సరదా.. ఇద్దరి ప్రాణం తీసింది

11-08-2026 12:00 AM
  1. చెరువులో మునిగి చిన్నారుల మృతి
  2. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో ఘటన

కుబీర్,ఆగస్టు 10 (విజయ క్రాంతి) నిర్మ ల్ జిల్లాలో చెరువులు మొరం కోసం తవ్విన గుంత ఇద్దరు చిన్నారుల బలి తీసుకుంది. పాఠశాలకు సెలవు కావడంతో ఈత కొట్టేందుకు చెరువులోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు నీటి గుంటలో పడి మృతి చెందిన ఘటన కుబీర్ మండల కేంద్రంలో విషాదం నింపింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుబీర్ మండల కేంద్రంలోని నయా అబాదికి చెందిన గణేష్ (11), సోఫియాన్ (13) మరో బాలుడు ము గ్గురు స్నేహితులు.

సోమవారం పాఠశాలలకు సెలవు కావడంతో కుబీర్ సమీపంలోని ఎల్లమ్మ చెరువు వద్దకు వెళ్లారు. సోఫియాన్, గణేష్‌లు స్నానం చేసేందుకని చెరువులో ది గారు. మరో బాలుడు వారితో వెళ్లకుండా ఒ డ్డునే ఉండిపోయాడు. ఈతకు దిగిన ఇద్దరు నీటి లోతు తెలియక మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న మరో బాలుడు  కేకలు వేయడంతో అక్కడ ఉన్నపశువుల కాపరి అందులో దిగి గణేష్ అనే బాలుడిని ఒడ్డుకి చేర్చాడు. అప్పటికే మరో బాలుడు సోఫి యా చెరువులో మునిగిపోయే గల్లంతయ్యాడు.

గణేష్ కొన ఊపిరి కొట్టుమిట్టాడు తుండగా తల్లిదండ్రులు బాలుడ్ని హుటాహుటిన బై ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గజ ఈతగాళ్లు  గల్లంతైన బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న భైంసా ఏఎస్పీ, రూరల్ సీఐ ప్రవీణ్ కుమా ర్, కుబీర్ ఎస్‌ఐ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఒకే కాలనీకి చెందిన ఇద్దరు మృతి చెందడం కుబీర్‌లో విషాదాన్ని నింపింది.