తప్పతాగి నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్
అడ్డుకోబోయిన వ్యక్తిని ఢీకొట్టి చంపిన వైనం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): నాంపల్లో పోలీస్ స్టేషన్ పరిధి లో దారుణం జరిగింది. తప్పతాగి నిర్లక్ష్యం గా కారు నడుపుతూ ఓ యువకుడి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న నలుగురు యువకు లు.. అందులోని ఒక యువకుడి పుట్టిన రోజు సందర్భంగా ఫుల్‌గా మద్యం తాగి కారులో చార్మినార్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో మితిమీరిన వేగంతో కారు నడుపుతూ మార్గం మధ్యలో ఒక ఆటోను బలం గా ఢీకొనడంతో ఆటో పల్టీ కొట్టింది.
ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ కారును ఆపకుం డా వేగంగా పారిపోతుండగా వారిని అజయ్ అనే వ్యక్తి వెంబడించే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని కూడా కారుతో ఢీకొట్టి అతనిపై నుంచి కారు ఎక్కించారు. దీంతో అజయ్ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నలుగురు యువకుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.






