ఆణిముత్యం బాబు జగ్జీవన్ రామ్
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): మహనీయులే మహానుభావులు అవుతారని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డె అనిల్ తదితరులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాబు జగ్జీవ న్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ కులమతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ దళిత సమాజంలో పుట్టిన ఆణిముత్యం బాబు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్లా మంగ, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు బాలకృష్ణ, సాలాం, లక్ష్మి, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రేగుంట కేశవరావు, రాష్ట్ర నాయకుడు పొన్నాల నారాయణ, గిరిజన సంఘం జాతీయ నాయకుడు అర్జు మాస్టర్, పర్దాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్సింగ్ ప్రేమ్ కుమార్, మాలి సంఘం రాష్ట్ర నాయకుడు శంకర్, అఖిల గాండ్ల తేలి సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి తదితరులు పాల్గొన్నారు.




