6 April, 2026 | 2:50 AM

ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ప్రభుత్వం

06-04-2026 12:23 AM

మాజీ జోగు రామన్న

ఆదిలాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై పోలీసులను ఉసిగొలిపి ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ధ్వజ మెత్తరు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి జోగు రామన్న ని పోలీసులు మరోసారి తన నివాసంలో ముందస్తు అరెస్టు చేశారు. ఖానాపూర్ కు వెళ్లనీవ్వ కుండా గత రెండు రోజులుగా  మాజీ మంత్రిని హౌజ్ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల నైపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి అన్నారు. నియంతృత్వ పోకడతో ఈ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన  నేడు ప్రజాస్వామ్యపద్ధంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకొని ప్రజల పక్షాన పోరాడేఎందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజాపాలన పేరుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లో నెట్టుతుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్  కు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.