6 April, 2026 | 2:45 AM

జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయం

06-04-2026 12:21 AM

మంచిర్యాల, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. ఆదివారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాలులో జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, శ్రీనివాస్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.