28 August, 2026 | 5:19 AM

డ్రైవర్ల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం..

28-08-2026 01:20 AM

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, ఆగస్టు 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూ ర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ లు అ న్నారు.

గురువారం జిల్లా కేంద్రంలోని మన్నెం సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో అప్పటి ము ఖ్యమంత్రి కేసీఆర్ డ్రైవర్ల కోసం అమలు చేసిన ప్రమాద బీమా పథకంలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండ లం పోలుమల్ల గ్రామానికి చెందిన కొడవలికంటి యాకయ్య కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా చెక్కును బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌడ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యం లో అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రమాద బీమా పథకాన్ని అమలు చేసిందన్నారు.

డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రజాక్, గ్రామ శాఖ అధ్యక్షుడు రేసు వెంకన్న, మధు, లింగారెడ్డి, వినోద్, మల్లారెడ్డి, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.