రైతులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రభుత్వం
కొత్తపల్లి, మే 6(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ బిజేపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్ధంపూర్ రాజీవ్ రహదారిపై రైతులతో కలిసి బిజెపి నాయకులు రాస్తారోకో చేపట్టారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులు అరుకాలం పండించిన ధాన్యానికి కోర్రిలు పెడుతూ ఒక కింటాకు 5 కిలోల చొప్పున తరుగు తీస్తూ అది చాలాదు అన్నట్లు ఏ గ్రేడ్ వడ్లకు కూడా కామన్ గ్రేడ్ కింద విలువ కట్టి ఇవ్వడం వల్ల ఇటు రైతు ఒక ఎకరాకి ఐదు కిలోల తో పాటు కామన్ గ్రేడ్ వల్ల క్వింటాల్కి 2000 నష్టాన్ని ఎదుర్కొంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన రవాణా సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల ను దోచుకోవడానికి సిద్ధమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తరుగు పేరు మీద చేస్తున్న దోపిడిని ఆపాలని లేదంటే బిజెపి పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులను అడ్డుకుంటామంటూ హెచ్చరించారు.
తదుపరి మండల అధ్యక్షులు మడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం రాక ముందు రైతులు రాజులు చేస్తామని, నేడు రైతులను నిలువు దోపిడి చేస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మేలు చేయ లేదని , నేడు రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ప్రస్తుతం రైతులను తాలుతరుగు పేరుతో ఏ గ్రేడ్ కు ఇవ్వవలసిన ధరను కామన్ గ్రేడ్ కింద లెక్కపెట్టి ధర నిర్ణయించి రైతులను నిలువు దోపిడీ చేస్తుందని అన్నారు.






