తాడ్వాయిలో తిరిగి కొలువైన సింగిల్ విండో పాలకవర్గం
తాడ్వాయి, మే, 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని సింగిల్ విండో పాలకవర్గం తిరిగి బుధవారం బాధ్యతలు స్వీకరించింది. నాలుగు నెలల అనంతరం పాత సింగిల్ విండో పాలకవర్గమే తిరిగి బాధ్యతలు చేపట్టారు. పాత పాలకవర్గం సమయం పూర్తి కావడంతో ప్రభుత్వం సింగిల్ విండో పాలకవర్గాలను రద్దు చేసింది.
సింగిల్ విండో చైర్మన్ ల స్థానంలో ప్రభుత్వ అధికారులను ఇన్చార్జిలు గా నియమించింది. దీనిపై సింగిల్ విండో చైర్మన్లు హైకోర్టుకు వెళ్లగా కోర్టు చైర్మన్ లకు, పాలకవర్గానికి సానుకూలంగా తీర్పు వెలువరించింది.దీంతో పాత సింగిల్ విండో పాలకవర్గం చైర్మన్,డైరెక్టర్లు తిరిగి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి మాట్లాడుతూ.... ప్రభుత్వం పాత చైర్మన్ లకి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులను నియమించడం బాధాకరమన్నారు. తాము కోర్టుకు వెళ్లడంతో కోర్టు తమకే న్యాయం చేసిందని తెలిపారు.ప్రభుత్వం అనంతరం నామినేటెడ్ పోస్టులను ఏర్పాటు చేసిన దీనిపై సైతం తిరిగి కోర్టుకు వెళ్తామని ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన వారిలో సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి, వైస్ చైర్మన్ ధర్మారెడ్డి, డైరెక్టర్లు రాజిరెడ్డి, సంజీవరెడ్డి, నర్సింలు,మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.






