calender_icon.png 7 December, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళి

07-12-2025 01:21:10 AM

టీఎన్జీవో ఆధ్వర్యంలో కార్యక్రమం

హైదరాబాద్, డిసెంబర్ (విజయక్రాంతి): తెలంగాణ ఎన్‌జిఓ యూనియన్, హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం ఘనంగా నివాళులర్పించారు. యూనియన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, ఉద్యోగులు అంబేడ్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. యూనియన్ అధ్య క్షుడు విక్రమ్ అధ్యక్షత వహించగా, కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ సమన్వయం చేశారు.

ముఖ్య అతిథిగా సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. ఎం. హుస్సేని (ముజీబ్) హాజరయ్యారు. హుస్సేని మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను, ఆయన పోషించిన మహోన్నత పాత్రను గుర్తుచేసుకున్నారు. ‘డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక శకానికి నాంది పలికారు. జిల్లా యూనియన్ అధ్యక్షుడు విక్రమ్ తమ ప్రసంగంలో, అంబేద్కర్ జీవితం నుండి నేటి ఉద్యోగులు, యువత నేర్చుకోవాల్సిన ముఖ్య అంశాలను వివరించారు.

కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కె. ఆర్. రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఖాలెద్ అహ్మద్, శంకర్, కార్యవర్గ సభ్యులు మోఖీమ్ ఖురేషీ, క్లాస్ 4 సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు దాస్యా నాయక్, ఖదర్ బిన్ హసన్, ఈ.ఎన్.టి. హాస్పిటల్ ప్రతినిధి రాజు, ఐ.టి.ఐ. ప్రతినిధి సత్యనారాయణ, జిల్లా ఏ.పి.ఆర్.ఓ. ప్రతినిధి మహమ్మద్ వాహీద్ పాల్గొన్నారు.