calender_icon.png 7 June, 2025 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరిపల్లి అనంతరాములుకు ఘన నివాళి

27-05-2025 12:00:00 AM

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): స్వర్గీయ దరిపల్లి అనంతరాములు 4వ వర్ధం తి సందర్భంగా అనంతారంలోని వాత్సల్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సోమవారం అనంతరాములు చిత్రపటానికి వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్‌కుమార్, కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్‌కుమార్ ఘనంగా నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా దరిపల్లి నవీన్‌కుమార్, దరిపల్లి ప్రవీణ్‌కుమార్ మాట్లాడు తూ..

వాత్సల్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, వాత్సల్య కాలేజీ అఫ్ ఫార్మసీ, వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాత్సల్య కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, కృషి ఐటీఐ, శ్రీ వాగ్దేవి జూనియర్, ఒకేషనల్ కళాశాల, శ్రీ సాయికృప డిగ్రీ, పీజీ కళాశాల, భువనగిరి, దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఖమ్మం, వాణి ఐటిఐ గౌతమ బుద్ధ మైనారిటీ ఐటిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొదలగు కళాశాలలు, విద్యాసంస్థల ఫౌండర్ అని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పి లక్షకు పైగా విద్యార్థులను తీర్చి దిద్దారని చెప్పారు. తమ విద్యాసంస్థలలో ఎంతోమంది బోధన, బోధనేతర సిబ్బందికి ఉపాధి ఇచ్చాడని గుర్తుచే శారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్‌గా, బీసీ సంక్షేమ సంఘం జాతీ య ఉపాధ్యక్షుడిగా బీసీల అభ్యున్నతికి ఎలనేని సేవ చేశారన్నారు.

శాలివాహన కుమ్మర్ల ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా కుమ్మరుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ బీవీ రెడ్డి, వాత్సల్య పాలిటె క్నిక్ కళాశాల ఇన్చార్జి సురేష్, కృషి ఐటీఐ ప్రిన్సిపల్ నామోజి రమేష్, వాగ్దేవి జూనియర్, ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ కొలను శ్రావణ్‌రెడ్డి, శ్రీ సాయికృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ యాకూబ్, వాత్సల్య ఫార్మసీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీధర్‌బాబు, అధ్యాపకులు వెంకటేష్, సునీల్, శ్యామ్, మోయిన్, రాంబాబు, నాన్ టీచింగ్ స్టాఫ్ గోపాలకృష్ణ, శంకర్, కల్పన, స్నాపిక, కావ్య పాల్గొన్నారు.