6 July, 2026 | 4:22 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధులకు ఘన సన్మానం

26-06-2025 12:05 AM

నారాయణపేట. జూన్ 25 (విజయక్రాంతి):నాటి ప్రధాని ఇందిరాాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు జీవితం గడిపిన పోరాట యోధులకు బుధవారం నారాయణపేట లో బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

జిల్లా బిజెపి అద్యక్షుడు సత్య యాదవ్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం లో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధులు జి.కుర్మన్న, కుంటి ఎల్లప్ప, జి.నింగిరెడ్డి,నాగు రావు నామాజీ,రమేష్,సంఘం నాథ్,నర్సింహులు పాల్గొన్నారు. వీరిని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు కే. రతంగ పాండు రెడ్డి,జిల్లా బిజెపి అద్యక్షుడు సత్య యాదవ్,మాజీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాసులు,నాయకులు ఆశప్పా,ఈ.వెంకట్ రాములు, సాయిబన్న,గణప శ్రీనివాస్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమర్జెన్సీ నాటి జైలు అనుభవాలను వారు గుర్తు చేస్తూ కార్యకర్తలకు వివరించారు.స్వార్థం కోసమే కాంగ్రెస్ పని చేస్తున్నదని వారు విమర్శించారు.కానీ ఏ స్వార్థం లేకుండా దేశ హితం కోసం సర్వం త్యజించి ప్రధాని నరేంద్రమోడీ పనిచేస్తున్నారని అన్నారు.

ఆయనను ఆదర్శంగా తీసుకుని దేశం కోసం పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి అధ్యక్షుడు పోషల్ వినోద్,ప్రధాన కార్యదర్శి వడ్డే దత్తు,నాయకులు వై.నారాయణరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,చిన్న రఘు,నక్క సత్యనారాయణ ఉమాకాంత తదితరులుపాల్గొన్నారు.