18 April, 2026 | 6:33 PM

అగ్నివీర్‌కు ఎంపికైన వారికి ఘన సన్మానం

01-04-2025 01:37 AM

 సుల్తానాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాల మైదానం లో సోమవారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్నివీర్ ఆర్మీకి ఎంపికైన సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆరేపల్లి కి చెందిన  కౌడగాని రాకేష్ , సుల్తానా బాద్ మండలం గట్టే పల్లి కి చెందిన శీలం అభినవ్ లకు శాలువాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మంద శ్రీనివాస్ గౌడ్, విశ్వబ్రాహ్మ ణుల సంఘం నాయకుడు కందుకూరి ప్రకాష్ రావు ( పెద్దన్న ), చొప్పరి సుమన్ తో పాటు వాకర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.