calender_icon.png 3 July, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

02-07-2025 05:17:31 PM

కార్మిక సంఘాల జేఏసీ..

మందమర్రి (విజయక్రాంతి): కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు(National Trade Unions) ఇచ్చిన జూలై 9 దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. పట్టణంలోని ఏఐటియుసి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. కార్మికులు సుదీర్ఘ కాలం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులుగా విభజించి కార్మిక చట్టాలను రద్దు చేయడంతో పాటు, కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడానికి సిద్ధమైందని ఇదే జరిగితే కార్మిక వర్గం కట్టు బానిసలుగా మారుతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడులను రద్దు చేయాలని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కాపాడుకోవాలనే డిమాండ్ తో ఈనెల 9న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికులు ఓపెన్ కాస్ట్ ఓబి కార్మికులతో పాటు సింగరేణిలోని అన్ని విభాగాల కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ కార్మిక సంఘాలు ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఐటియు, టిబిజికేఎస్, జిఎల్బికేఎస్ సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, సలేంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్, కాంపల్లి సమ్మయ్య, శంకర్రావు మిట్ట సూర్యనారాయణ, ఎస్ నాగరాజ గోపాల్, రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్య, మేడిపల్లి సంపత్, వీరారెడ్డి, తిరుపతి, రాములు పాల్గొన్నారు.