20 June, 2026 | 4:04 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

ఎంబీబీఎస్ సీట్ సాధించిన విద్యార్థినీలకు ఘన సన్మానం

16-10-2024 05:35 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని గుండాల మండల వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎంబీబీఎస్ లో సీట్ సాధించిన ఇద్దరు విద్యార్థినీలను ఘనంగా సన్మానించారు. గుండాల మండలంలోని సాయనపల్లి గ్రామానికి చెందిన ఇర్పా నాగేశ్వరరావు సుశీల దంపతుల కుమార్తెలైన అమృత రాణి, బేబీ ప్రసన్నలు ఎంబీబీఎస్ లో ఫ్రీ సీట్ సాధించడంతో గుండాల వాసవి క్లబ్ మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు వారికి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మానాల నారాయణమూర్తి, మానాల ప్రణీత్, తవుడిశెట్టి నాగరాజు, తవుడిశెట్టి రాంబాబు, అయితా శ్రీశైలం, అయితా పూజీత్, అయితా నాగమల్లయ్య, తాటికొండ వీరన్న, పాలడుగు భరత్, శ్రీరంగం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.