calender_icon.png 5 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దంతూరి సత్తయ్యకి ఘన సన్మానం

05-12-2025 01:39:06 AM

ముఖ్యఅతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష హాజరు

చిట్యాల, డిసెంబర్ 4(విజయ క్రాంతి): రామన్నపేట అదనపు కోర్టు కి సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా ఎంపికై బాధ్యతలు చేపట్టిన దంతూరి సత్తయ్య కి రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ.మస్జిద్ అధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సభ్యులందరూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష హాజరయ్యారు.

అనంతరం వారూ మాట్లాడుతూ జ్యుడిషియల్ వ్యవస్థలో నిబద్దతతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉంటాయని అన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మాతో పాటు కలసి పని చేసిన ఉన్నత హోదాలో వెల్లినందున సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో  సీనియర్ అడ్వకేట్ యాపాల కృష్ణ రెడ్డి, కంపాటి యాదగిరి, జినుకల ప్రభాకర్, కేమా రామదాసు, ఉయ్యాల హనుమంతు గౌడ్, బర్ల డేవిడ్, నకిరేకంటి మోగులయ్య, యాదాసు యాదయ్య, దినేష్ కుమార్, మామిడి వెంకట్ రెడ్డి, నోముల స్వామి, ఏళ్ల శ్రీశైలం, కూనురూ శ్రీనివాస్, ఎండీ.అజిజోద్దిన్, మహిళ న్యాయవాది రజియా బేగం, తదితరులు పాల్గొన్నారు.