29 July, 2026 | 9:39 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అత్యవసర భేటీ

11-06-2026 02:32 AM

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు హాజరు?

న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఈ కీలక భేటీ జరగనుంది.  సమావేశానికి  ఏఐసీసీ  ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్ఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు.

ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే అందరికీ లేఖలు పంపా రు. పశ్చిమబంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వా త అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కా యి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత తిరుగుబాటు కలకలం రేపుతోంది. ఇదే సమయంలో ‘ఆపరేషన్ లోటస్’ ద్వారా ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే భయాల మధ్య కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది.

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఇప్పటికే సోనియా, రాహుల్‌గాంధీలతో వరుస భేటీలు జరుపుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పా ర్టీలతో కాంగ్రెస్ బంధం, భవిష్యత్తు వ్యూహాలపై  భేటీలో దిశానిర్దేశం చేయను న్నారు. జూన్ 8న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కొన్ని అంతర్గత విభేదాలు బయ టప టడ్డాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కొన్ని ఎదురుదె బ్బలు తగిలినప్పటికీ, లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వీగిపోయేలా చేయడంలో ప్రతిపక్షాలు సాధించిన ఐక్యతను ఖర్గే అభినందించారు. ఇదే స్ఫూర్తితో, మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు సరికొత్త ప్రణాళికను ఈ భేటీలో రాష్ట్రాల నేతలకు వివరించనున్నారు.