21 May, 2026 | 12:30 AM

ఆర్‌ఎస్‌ఎస్‌లో తన గురు స్థాయిలో ఉన్న పలువురికి ఘన సన్మానం..

11-08-2025 01:50 AM

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ..

ముషీరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు ఆర్‌ఎస్‌ఎస్ లో తన గురు స్థాయిలో ఉన్న నాయకులు డాక్టర్ మనోహర్ షిండే , డాక్టర్ బీరవోలు సురేందర్ రెడ్డి, వడ్ల భాగయ్య,  రామచంద్రయ్యలను ఆదివారం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ  హైదరాబాద్ రాంనగర్ లోని తన నివాసంలో ఘనంగా  సత్కరించారు.

తనను1984లో తనను రాష్ట్రీ య స్వయం సేవక్ సంఫ్‌ు ఆర్‌ఎస్‌ఎస్ లో  చేర్పించి, శిక్షణ ఇచ్చి, సంస్కారంతో తనను జాతీయ భావంతో, దేశ భక్తితో స్ఫూర్తి నింపి ప్రస్తుతం అమెరికా దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల  సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వహిస్తూ  కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న డాక్టర్ మనోహర్ షిండే  భాగ్యనగరానికి విచ్చేసిన సందర్భంగా తన స్వగృహానికి ఆహ్వానించి శాలువాతో ఘనం గా  సత్కరించారు.

డాక్టర్ మ నోహర్ షిండే తో పాటు1965 నుండి తనను సంఘ కార్యా న్ని ఇంకా అభివృద్ధి చేయడానికి నైపుణ్యా న్ని, మానవ సంబంధాలు, వ్యక్తి నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలో నేర్పిన డాక్టర్ బీరవోలు సురేందర్ రెడ్డి, ప్రస్తుతం ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత స్థాయి లో కార్యవర్గ సభ్యులు, జాతీయ మాజీ సం యుక్త ప్రధాన కార్యదర్శి వడ్ల భాగయ్య తన తో బాటు ప్రచారక్‌గా పనిచేసి, ప్రస్తుతం వనవా సి కళ్యాణ్ ఆశ్రమంలో బాధ్యతలు నిర్వహిస్తున్న  రామచం ద్రయ్యలను బండారు దత్తాత్రేయ  ఆతిధ్యం ఇచ్చి ఘనంగా  సన్మానించారు. వీరితో పా టు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, లోక్‌సభ సభ్యు లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, ఏబివిపి జాతీయ మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్ మనోహర్ రావు, ఎస్ ఐ రిటైర్డ్ జనరల్ మేనేజర్ బాల్డా అశోక్, 93 సంవత్సరాల పాత స్వయం సేవక్  రామస్వామి,  దత్తాత్రేయ కుటుంబ సభ్యులు బం డారు వసంత, బండారు విజయలక్ష్మి, డాక్టర్ బి.జిగ్నేష్ రెడ్డి, బి. జనార్దన్‌రెడ్డి, ఆర్. సత్యనారాయణ రాష్ర్ట యువజన శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ తదితరులు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తన గురు స్థాయిలో ఉన్న నాయకులతో ఈ కార్యక్రమం ఒక ఆత్మీయ సమ్మేళనంగా కొనసాగిందన్నారు.  మంచి అనుభూతి కలిగించిందని, తమ 60 సంవత్సరాల యొక్క సామజిక సేవ అనుబంధాన్ని, అనేకమైన విషయాలను, సంఘటనలకు ఈ సందర్భంగా వివరించుకున్నామని దత్తాత్రేయ  తెలిపారు.