calender_icon.png 11 August, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్మల చూపు.. హైదరాబాద్ వైపు

11-08-2025 01:48:41 AM

* మధ్యస్థాయి కమ్మ నాయకులు.. ప్రస్తుతం తమ సమస్యలను వినిపించే అవకాశం కూడా లేదని భావి స్తున్నారు. పరిష్కారం విషయం పక్కన పెడితే కనీసం వినడానికి కూడా ఎవ రూ లేరని ఒక కమ్మ వ్యాపారవేత్త పేర్కొన్నారు. కనీసం తాము చూపిన సహకారాన్ని గుర్తించాలని కమ్మ సామాజికవర్గం కోరుకుంటోంది.

* జగన్ పాలనలో ప్రాధాన్యం పొందిన మేఘ ఇంజినీరింగ్ (ఎంఈఐఎల్), సెల్ కాన్, గ్రెన్కో, విశ్వేశ్వర్‌రెడ్డి, యా క్సిస్ పవర్ వంటి కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో లాభదాయకమైన ఒప్పందాలను పొందుతున్నట్టు తెలుస్తున్నది. ఒకవైపు టీడీపీకి విధేయులైన కమ్మలు బాధపడుతుంటే, మరోవైపు ఇతర సామాజికవర్గానికి చెందిన వారు ప్రాధాన్యం, కాంట్రాక్టులను పొందుతూ అభివృద్ధి చెందుతున్నా రని గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్త ఒకరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని కమ్మ సామాజికవర్గంలో అసంతృప్తి తుఫానులా చెలరేగుతోంది. ఈ వర్గం చాలా కాలంగా నారా చంద్రబాబునాయుడు, ఆయన ఆధ్వర్యంలోని టీడీపీకి మద్దతుగా నిలుస్తోంది. దశాబ్దాలుగా కమ్మ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు చంద్రబాబుకు అండగా నిలిచారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తప్పుడు కేసు లు, జైలు శిక్షలు వంటి కష్టాలను భరించారు.

అయినప్పటికీ 2024, జూన్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సామాజికవర్గాన్ని పక్కన పెట్టారని, పూర్తిగా విస్మరించారని కమ్మ నాయకులు, ప్రజలు భావించారు. దీని ఫలితంగా భవిష్యత్తు కోసం హైదరాబాద్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైపు చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజకీయంగా, ఆర్థికంగా ప్రభావవంతమైన కులమైన కమ్మ సామాజికవర్గం.. 1982లో ఎన్టీ రామారావు టీడీపీని ప్రారంభించినప్పటి నుంచి దానికి మూలస్తంభంగా ఉంది.

వ్యాపారం, వాణిజ్యం, ఐటీ రంగాల్లో ఆర్థిక పలుకుబడి, ఆధిపత్యానికి ప్రసిద్ధి చెందిన కమ్మలు చారిత్రాత్మకంగా చంద్రబాబు వెనుక చేరారు. ఆయనను తమ గౌరవానికి చిహ్నంగా భావించారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్ హయాంలో చాలా మంది కమ్మ నాయకులు టీడీపీ పట్ల తమ విధేయత చూపినందుకు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు.

అలాంటి వారిపై తప్పుడు కేసులు నమోదయ్యాయి. కొంతమందిని అకారణంగా జైలులో పెట్టారు. మరికొందరు ఇలాంటి విపత్కర సమయంలో టీడీపీని నిలబెట్టడానికి ర్యాలీలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించడానికి వ్యక్తిగత నిధులను కూడా కుమ్మరించారు. కానీ ఈ త్యాగాలను టీడీపీ మరచిపోయినట్టు కమ్మ సామాజికవర్గం భావిస్తున్నది. 

కమ్మ సామాజికవర్గం వారు చంద్రబాబు, టీడీపీ కోసం ప్రతిదీ ఫణంగా పెట్టి పగలు, రాత్రి పనిచేశారు. కానీ ఇప్పుడు, వారి విధేయతకు అర్థమే లేకుండా పోయింది. చంద్రబాబు, అతని కుమారుడు నారా లోకేశ్ తిరిగి అధికారంలోకి రావడానికి పోరాడిన వారిని మరచిపోయారనే భావన విస్తృతంగా ఉందని చాలామంది భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పదవుల కేటా యింపు ఈ ఆగ్రహాన్ని మరింత పెంచింది.

వారి సహకారానికి గుర్తింపు లభిస్తుందనే అంచనాలు ఉన్నప్పటికీ, పదవుల కేటాయింపు సమయంలో చాలా మంది కమ్మ నాయకులను విస్మరించారు. 2024, జూన్ 13న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు.. తన మంత్రివర్గంలో కులాల సమతౌల్యతను పాటించారని ప్రచారం జరిగింది.

మంత్రి పదవుల్లో ఎనిమిది వెనుకబడిన తరగతులకు, ఐదు కమ్మలకు, నాలుగు కాపులకు కట్టబె ట్టారు. అయితే, మంత్రి వర్గంలో కమ్మ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యం లభించలేదని అభిప్రాయపడ్డారు. కమ్మ సామాజికవర్గానికి కంచు కోట అయిన కృ ష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు కీలక పదవులను అప్పగించకపోవడంతో త మ ప్రధాన మద్దతుదారులైన కమ్మల పట్ల చంద్రబాబు ప్రదర్శించిన నిబద్ధతను చాలా మంది ప్రశ్నించారు.

మంత్రివర్గంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కమ్మ సామాజికవర్గం నుంచి ఉన్నారు. అ యితే, కేశవ్ కమ్మ సమాజానికి దూరంగా ఉంటారని, గొట్టిపాటి రవికుమార్ ప్రముఖ వ్యాపారవేత్త విశ్వేశ్వర్‌రెడ్డి కనుసన్నల్లో నడుచుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. ‘కమ్మ లకు సహాయం చేయగలిగినంత శక్తి తనకు లేదని గొట్టిపాటి స్వయంగా తన సహచరుల ఎదుట ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

తమ సా మాజికవర్గంతో సంబంధాలు కొనసాగించడానికి వారికి చిన్న మైనింగ్ కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జగన్ పాలనలో బాగా అభివృద్ధి చెందిన వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల పట్ల కొనసాగుతున్న అనుకూలత.. కమ్మ సమాజంలో నెలకొన్న నిరాశను మరింత పెంచుతోంది.

2019 నుం చి 2024 వరకు జగన్ పాలనలో ప్రాధా న్యం పొందిన మేఘ ఇంజినీరింగ్ (ఎంఈఐఎల్), సెల్ కాన్, గ్రెన్కో, విశ్వేశ్వర్‌రెడ్డి, యా క్సిస్ పవర్ వంటి కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో లాభదాయకమైన ఒ ప్పందాలను పొందుతున్నట్టు తెలుస్తున్నది. ఒకవైపు టీడీపీకి విధేయులైన కమ్మలు బాధపడుతుంటే, మరోవైపు ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ప్రాధాన్యం, కాంట్రాక్టులను పొందుతూ అభివృద్ధి చెందుతున్నా రని గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్త ఒకరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

ఇదిలా ఉండగా అధికార యంత్రాంగం లో సమస్యగా మారింది. జగన్ పట్ల విధేయ త చూపింనందుకు లోకేశ్ రెడ్‌బుక్ జాబితాలో చేర్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో కీలక పదవుల్లో నియమితులయ్యారు. వారు గతంలో పొందిన అదే అధికారాన్ని ఇప్పు డూ అనుభవిస్తున్నారు. దీనికితోడు జగన్ హయాంలో సైతం టీడీపీకి మద్దతుగా నిలిచినందుకు అణచివేతకు గురైన అ ధికారు లను ఇప్పుడు పక్కన పెట్టారు. ఈ పరిస్థితి వారికి చెంపపెట్టు లాంటిది. నాడు చంద్రబాబుకు అండగా నిలిచినవారు ఇప్పటికీ ప్రా ధాన్యం లేని పదవుల్లో ఉండగా, జగన్ విధేయులు మాత్రం తిరిగి కీలక బాధ్యతలు చేపట్టారు. 

ముఖ్యంగా మధ్యస్థాయి కమ్మ నాయకు లు.. ప్రస్తుతం తమ సమస్యలను వినిపించే అవకాశం కూడా లేదని భావిస్తున్నారు. పరిష్కారం విషయం పక్కన పెడితే కనీసం విన డానికి కూడా ఎవరూ లేరని ఒక కమ్మ వ్యా పారవేత్త పేర్కొన్నారు. కనీసం తాము చూపి న సహకారాన్ని గుర్తించాలని కమ్మ సామాజికవర్గం కోరుకుంటోంది. చంద్రబాబు, లోకేశ్‌ను కమ్మ ప్రతినిధులు సంప్రదించలేకపోవడం వల్ల ఈ పరాయీకరణ భావన మరిం త తీవ్రమైంది.

ఈ అసంతృప్తి చాలా మంది కమ్మ వ్యాపారవేత్తలు, నాయకులను హైదరాబాద్ వైపు తిరిగి చూసేలా చేస్తున్న తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తాను కమ్మ అనుకూలమైన వ్యక్తిగా సంకేతాలిస్తున్నారు. 2023లో చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్‌లో కమ్మల నేతృత్వంలోని నిరసనలను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అణచివేసింది.

కానీ రేవంత్‌రెడ్డి అలా కాకుండా హైదరాబాదే కమ్మ సమాజానికి సురక్షితమైన ప్రాంతమనేలా భరోసా కల్పిస్తున్నారని ఇటీవల తెలంగాణకు కార్యకలాపాలను మార్చిన ఒక కమ్మ వ్యాపారవేత్త అంగీకరించారు. తమ సమాజం అందించే సహకారాల విలువను రేవంత్ అర్థం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి క మ్మ సమాజంలో నిరాశ, అసంతృప్తి స్పష్టం గా కనిపిస్తుండటంతోపాటు వారి దృష్టి హై దరాబాద్ వైపు మళ్లుతోంది.

ఇక్కడ అవకాశాలు, గుర్తింపు మరింతగా లభిస్తున్నట్టు వా రు నమ్ముతున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఈ వాస్తవిక పరిస్థితులపై దృష్టి సారించకపోతే నాలుగు దశాబ్దాలుగా తమకు బలంగా, న మ్మకంగా మద్దతు తెలిపిన కమ్మ సామాజికవర్గం విశ్వాసాన్ని టీడీపీ కోల్పోయే ప్రమా దం పొంచి ఉన్నది. అయితే కమ్మ సామాజికవర్గంలోని అసంతృప్తిని చంద్రబాబు గుర్తి స్తారా? లేక పెరుగుతున్న ఈ అసంతృప్తితో టీడీపీ పునాదికి బీటలు బారనున్నాయా? అనేది వేచి చూడాలి.

సి.ఎల్. రాజం

చైర్మన్, విజయక్రాంతి