22 April, 2026 | 1:09 AM

30కి.మీ.కు ఒక హెల్త్‌సెంటర్ !

28-06-2024 12:14 AM

పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ వెల్లడి 

ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టాలని డీఎంహెచ్‌వోలకు ఆదేశం

హైదరాబాద్, జూన్ 27(విజయక్రాంతి) : పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రతి 30 కిలోమీటర్ల దూరం లో ఒక ప్రభుత్వ హెల్త్ సెంటర్ ఉం డేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అధికారులు జవాబుదారీతనంగా ఉండాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో వెంగళరావునగర్‌లోని ఇండి యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసులో అన్ని జిల్లాల డీఎంహెచ్‌ఓలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవల కోఆర్డినేషన్‌పై మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందించడంలో డీఎంహెచ్‌ఓలపై గురుతర బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా, ఏరియా, పీహె చ్‌సీల మధ్య కనెక్టివిటీపై దృష్టిసారించాలని సూచించారు.  ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వాటి లైసెన్స్‌లు రద్దు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అటెండెన్స్ తప్ప నిసరిగా నిర్వహించాలని చెప్పా రు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముం దస్తు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

నిరంతరం పర్యవేక్షించాలి

రోగులకు మెరుగైన డైట్‌ను అందించాలని, డాక్టర్లు విధిగా సమయపాలన పాటిం చాలని, డీఎంహెచ్‌ఓలు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి దామోదర సూచించారు. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగేలా సేవలు అందించాలన్నారు. ఈ సంద ర్భంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్  పీసీఅండ్ పీఎన్‌డీటీ యాక్ట్  అమలు, అవగా హన కోసం రూపొందించిన వాల్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్,  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్‌నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, తదితరులు పాల్గొన్నారు.