ఆటలతోనే ఆరోగ్య భారత్
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ముఖ్యంగా యువత ఎక్కువగా ఉన్న మన భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో జరిగే వివిధ క్రీడా పోటీల్లో అధమ స్థానంలో ఉండటం అత్యంత బాధాకరమైన విషయం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కేవలం 1 స్వర్ణం, 2 రజతం, 4 కాంస్య పతకాలు వెరసి 7 పతకాలు సాధించింది.
ఇదే క్రీడల్లో అమెరికా మొత్తం 113 పతకాలు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో 88 పతకాలతో చైనా, 58 పతకాలతో జపాన్ తృతీయ స్థానంలో నిలిచా యి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో మన భారత్ స్థానం మరింత దిగజారింది. ఒక్క స్వర్ణం పతకం కూడా సాధించలేదు. రజతం 1, కాంస్య పత కాలు 5 సాధించింది. ఇవే క్రీడల్లో అమెరికా మొత్తం 126 పతకాలతో ప్రథ మ స్థానంలో, 91 పతకాలతో చైనా ద్వితీయ స్థానంలో, 45 పతకాలతో జపాన్ తృతీయ స్థానంలో నిలిచాయి.
మన కంటే చిన్న దేశాలు కూడా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నాయి. కానీ, మన దేశం మాత్రం అం తగా రాణించడం లేదు. గత 12 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం కూడా అనుకున్నం త స్థాయిలో క్రీడలకు నిధులు కేటాయించడం జరగలేదు. 2047 నాటి కి వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తు న్న కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రా లు ఇకనైనా క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఒలింపిక్స్‌లో మన ప్రదర్శనను బట్టి తెలుస్తున్నది.
ఈ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మరికొన్ని అంశాలు లోతు గా అధ్యయనం చేయడం ద్వారా ఆటల ద్వారానే ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి అనే వాస్తవాన్ని గుర్తిద్దాం. 1928, 1932, 1936 ఒలింపిక్స్ క్రీడల్లో వరుసగా భారతదేశానికి హాకీలో స్వర్ణ పతకాలు సాధించి పెట్టిన హాకీ మాంత్రికుడు ‘మేజర్ ధ్యాన్ చంద్’ జయంతిని 2012 నుంచి జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటు న్నాం. ‘వారధులు నిర్మిద్దాం- అడ్డంకులు ఛేదిద్దాం’ అనే థీమ్‌తో ఈ సం వత్సరం క్రీడా దినోత్సవం జరుగుతుంది. ఈ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలతో పోలిస్తే క్రీడల్లో మన దేశం వెనుకబడి ఉండటా నికి కారణాలను విశ్లేషించుకోవాలి. భవిష్యత్తులో భారత్ అంతర్జాతీయ స్థాయిలో ముందువరుసలో నిలవడానికి చర్యలు చేపట్టాలి.
ప్రపంచ దేశా ల్లో ఎక్కువగా శారీరక శ్రమతో కూడిన ఆటలతోపాటు ఆలోచనతో ముడిపడి ఉన్న ఆటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కానీ, మన దేశంలో మాత్రం కేవలం శారీరక శ్రమతో కూడిన క్రికెట్ ఆటపైనే అటు ప్రభుత్వం, ఇటు యువత మోజు పెంచుకోవడం శోచనీయం. తత్ఫలితంగా మిగిలిన క్రీడలు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇకనైనా ఇతర క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఈ సంవత్సరం సుమారు రూ.53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో యువజన క్రీడా రంగానికి కేవలం రూ.4,479.88 కోట్లు కేటాయించారు. సుమారు 145 కోట్ల జనాభా కలిగిన మన దేశానికి ఈ నిధులు క్రీడాభివృద్ధికి ఏమాత్రం సరిపోవని గ్రహించాలి. ‘ఖేల్ ఇండియా మిషన్’ అని మంచి నామకరణం చేసి, 2030 నాటికి ప్రపంచ క్రీడల్లో భారత్‌ను టాప్ టెన్‌లో ఉంచుతామని, 2047 నాటికి మొదటి 5 స్థానా ల్లో భారత్‌ను నిలుపుతామని ఆకర్షణీయంగా చెప్తున్నది.
అయితే దేశంలో ఏ మేరకు క్రీడా సౌకర్యాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సామాగ్రి, ఉన్నాయనే విషయాన్ని విస్మరించకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో వివిధ క్రీడల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఎలా తయారవుతారనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. మనం జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్‌లో ఎం తో వెనుకబడి ఉన్నాం. ఇక పోలో, బిలియర్డ్స్ వంటి ఆటల్లో మచ్చుకైనా మన దేశంలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు లేరంటే అతిశయోక్తి కాదు. దేశ ఆర్థికాభివృద్ధిలో క్రీడలు, క్రీడాకారుల పాత్ర కీలకమని పాలకులు ఇప్పటికైనా గ్రహించాలి.
వ్యాసకర్త సెల్: 8374844618
ఐ.ప్రసాదరావు






