10 April, 2026 | 1:59 AM

ఆపదలో ఆపన్నహస్తం

10-04-2026 12:00 AM

తుర్కయంజాల్, ఏప్రిల్ 9: ఆపదలో ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు నక్క జంగయ్యగౌడ్ కుటుంబానికి టీజీ కాబ్ మాజీ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అండగా నిలిచారు. జంగయ్యగౌడ్ కూతురు అనూష కాలేయం సమస్యతో బాధపడుతోంది. ఆరోగ్యం బాగుపడాలంటే వైద్యులు రూ.80లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. పేద కుటుంబానికి చెందిన జంగయ్యగౌడ్ అంత ఖర్చుపెట్టి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు.

దీంతో విషయం తెలుసుకున్న కొత్తకుర్మ సత్తయ్య రూ.20వేల చెక్కును జంగయ్యకు అందించారు. అలాగే ప్రభుత్వంతో, ప్రజాప్రతిని ధులతో మాట్లాడి వైద్య ఖర్చులకు అయ్యే డబ్బు సమకూరేలా చూస్తామని హామీ ఇచ్చారు. జంగయ్యకు సాయం చేయదలిచినవారు ఫోన్ నెంబర్ 9347096677ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు జెనిగె విష్ణువర్దన్, కొంతం యాదిరెడ్డి, కారింగుల నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.