కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైవే ఎక్స్‌ప్రెస్ బస్టాండ్ ఏర్పాటు చేయాలి
- మంత్రికి వినతి పత్రం అందజేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి
- సానుకూలంగా స్పందించిన మంత్రి
- సాధ్యా, సాధ్యాలను పరిశీలించి స్థలం కేటాయించాలని మంత్రి ఆదేశం
కామారెడ్డి, మే 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై ఎక్స్ప్రెస్ బస్టాండ్ ఏర్పాటు చేయాలని మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి విన్నవించారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పట్టణ ప్రముఖులు హైదరాబాద్ వెళ్లి మంత్రిని కలిసి విన్నవించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం ఉత్తర తెలంగాణలో ప్రముఖ పట్టణంగా విస్తరిస్తుందని మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న కొత్త బస్టాండ్ విస్తీర్ణం తక్కువ ఉండడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
మరోవైపు 44వ జాతర దారి విస్తరణతో హార్మోన్ నిజాంబాద్ ఆదిలాబాద్ నిర్మల్ నాగపూర్ కోరుట్ల మెట్పల్లి ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కామారెడ్డి పట్టణంలోకి రావడం లేదన్నారు. నాన్ స్టాప్ బస్ నా కారణంగా కామారెడ్డికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి 44వ జాతర ఆధార పక్కన ప్రభుత్వ పరంగా ఆర్టిసి అనుకూలంగా భూమి ఉన్నందున ఆ స్థలంలో ఎక్స్ప్రెస్ బస్టాండును ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
హైవే బస్టాండ్ ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడినిజాంబాద్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలకు రాకపోకలు సాఫీగా జరిగే అవకాశం ఉంటుందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మంత్రి కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత ఆర్టీసీ ఎండీకి, జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. స్థలాన్ని పరిశీలించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి వివరాలను తెలుపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గడ్డమీద మహేష్, విజయ్ కుమార్ రెడ్డి, క్రీడా అధ్యక్షులు ఘనగోన లక్ష్మీనరస గౌడ్, కాంగ్రెస్ నేత లు శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.






