13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

ధర్మపురిలో చరిత్రాత్మక మలుపు

14-02-2026 12:25 AM
  1. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్
  2. బీఆర్‌ఎస్‌కు భారీ షాక్!
  3. మంత్రి అడ్లూరికి ప్రజల బ్రహ్మరథం

కరీంనగర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ధర్మపురి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజ కీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. రాష్ట్ర స్థాయిలో విస్తృత ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి, మొత్తం 15 వార్డులను  క్లీన్‌స్వీప్ చేసింది. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీకి ఇది ఊహించని ఘోర పరాభవంగా మారింది.

ఒకప్పుడు కంచుకోటగా భావించిన ధర్మపురిలో కాంగ్రెస్ విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఎన్నో విమర్శలు చేసినప్పటికీ, ప్రజలు మాత్రం ధర్మం, --న్యాయం వైపు నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వం లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ధర్మపురి ప్రజల మనసు గెలుచుకున్నాయి.

ఇంటింటికీ చేరిన సంక్షేమం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందించడం వల్ల కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం మరింత బలపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు ఈ ఫలితాలు అద్దం పట్టాయి. ఈ సారి ప్రజలు “వాగ్దానాలు కాదు -- అమలు కావాలి” అనే భావనతో, సంక్షేమ పథకాలు నేరుగా తమ జీవితాలను తాకాయని భావించి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.  

ప్రతి హామీని నెరవేర్చుతాం: అడ్లూరి 

మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో గడిచిన రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాత్రి పగలు కష్టపడి అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని ఆరు నెలల లోపు పూర్తి చేస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.