31 August, 2026 | 10:10 PM

Breaking News

ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్యం   •   ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర   •   ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి   •   సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి   •   పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి   •   బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి   •   మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి   •   కాంగ్రెస్‌ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం.!   •   24 గంటల విద్యుత్‌ కోసం రైతుల ధర్నా   •   వెలుగొండకు నికర జలాలు మళ్లిస్తే తెలంగాణకు దుర్దినం   •  

భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత..

09-12-2024 10:57 PM

285 క్వింటాళ్ల బియ్యం సీజ్ 

భద్రాచలం (విజయక్రాంతి): పేద ప్రజల బియ్యం పక్క దారి పడుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. రూ.10 లక్షల విలువగల సుమారు 285 క్వింటాళ్ల రేషన్ బియ్యం, పెద్ద మొత్తంలో సివిల్ సప్లై అధికారులు అక్రమ రవాణా చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేసారు. వివరాల్లోకి వెళితే సోమవారం తెల్లవారుజామున సివిల్ సప్లై అధికారులు గోదావరి బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళుతున్న ఛత్తీస్ ఘడ్ లారీని ఆపడానికి ప్రయత్నించగా డ్రైవర్ లారీ ఆపకుండా పారిపోతున్న సమయంలో వెంబడించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో లారీని అడ్డుకుని ప్రశ్నించగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుసుకుని, రేషన్ బియ్యాన్ని జిసిసి గోడౌన్ కు తరలించి కేసు నమోదు చేసి లారీనీ  పోలీస్ స్టేషన్ కు తరలించారు. రేషన్ బియ్యం విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని డిటి శ్రీనివాస్ తెలిపారు.