2 May, 2026 | 9:00 AM

ప్రజలకు మరింతగా అందుబాటులో పాల ఉత్పత్తులు

09-12-2024 10:50 PM

రిమ్స్ ఆవరణలో విజయ డెయిరీ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్... 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రజలకు మరింతగా అందుబాటులోకి విజయ డెయిరీ ఉత్పత్తులను తీసుకురావడం జరుగుతోందని, ప్రతి ఒక్కరు వాటిని ఆదరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ డెయిరీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. రోగులకు, వారి సహాయకుల కోసం తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ డెయిరీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విజయ డెయిరీ ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు. ఇప్పటికే పలు చోట్ల వీటి విక్రయాలు జరుగుతున్నాయని, త్వరలో ఆర్టీసీ బస్టాండ్ లోను సెంటర్ ను ఏర్పాటు చేయానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ అశోక్, విజయ డెయిరీ డీడీ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.