కేజీబీవీలో నిలిచిపోనున్న విద్యాబోధన
విద్యాశాఖ ఏడి గమినాయిల్ కు సమ్మె నోటీస్ అందజేత
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యాశాఖలో పనిచేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ ప్రధానమైన డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ పదవ తేదీ నుండి చేపట్టనున్న సమ్మె నోటీస్ ని సోమవారం విద్యాశాఖ ఏడి గమినాయిల్ కు అందజేశారు. జిల్లాలోని 15 కేజీబీవీలు, యు ఆర్ ఎస్ కు చెందిన స్పెషల్ ఆఫీసర్లు సమ్మర్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేజీబీవీ, యుఆర్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు ఇంద్రాణి, నాగసుధ, నలంద, అరుణ, పవిత్ర, పద్మ, కవిత, మీనా, ప్రవీణ, సుమలత, స్వప్న, నందిని, రమాదేవి, రిజ్వాన, ధర్మయ్య ఉన్నారు.






